“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ ఆవిష్కరణ, 18న గ్రాండ్ రిలీజ్

“పోలీస్ వారి హెచ్చరిక” తొలి టికెట్ ఆవిష్కరణ, 18న గ్రాండ్ రిలీజ్

Published on Jul 14, 2025 6:00 AM IST

Police

తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు బాబ్జీ రూపొందించిన “పోలీస్ వారి హెచ్చరిక” చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. బెల్లి జనార్థన్ నిర్మించిన ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రఫీ అందించగా, గజ్వేల్ వేణు సంగీతం, శివ శర్వాణి ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. తాజాగా, చిత్ర తొలి టికెట్ లాంచ్ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు.

ముఖ్య అతిథి మట్టి కవి బెల్లి యాదయ్య మాట్లాడుతూ, “మా తమ్ముడు బెల్లి జనార్థన్ నిర్మాతగా, బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఎందరో సీనియర్ నటీనటులు నటించడం గొప్ప విషయం. ఈ సినిమా కోసం పనిచేసిన బృందానికి ఆల్ ది బెస్ట్. మా ప్రాంతంలోని నిజమైన లొకేషన్లలో షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది, సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంది,” అన్నారు.
నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ, “నేను ఆర్మీలో పని చేసి వచ్చాను. సినిమాకు దర్శకులు, ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషిస్తారు. సినిమా విజయానికి మీడియా కారణం. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను,” అన్నారు.

దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ, “మా చిత్ర ప్రెస్ మీట్‌కు వచ్చిన మీడియా, మట్టి కవి యాదయ్య గారికి, నిర్మాత జనార్ధన్ గారికి, నటీనటులకు, సాంకేతిక బృందానికి ధన్యవాదాలు. ‘పోలీస్ వారి హెచ్చరిక’ సాధారణ సినిమాల్లా కాకుండా భిన్నంగా ఉంటుంది. ఇందులో నెగటివ్ క్యారెక్టర్ల మధ్య మంచి సన్నివేశాలు, ప్రేమ, పాటలు ఉంటాయి. మా చిత్ర టైటిల్ ఇప్పటికే ప్రేక్షకులలోకి బాగా వెళ్ళింది. పోలీస్ వారికి ధన్యవాదాలు. ఈ చిత్రం ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని తెలుపబోతున్నాము. సినిమా చూసిన ప్రేక్షకులు సమాజం మీద ప్రేమతో, బాధ్యతతో థియేటర్ నుండి బయటకు వెళ్తారు. అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి,” అని ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు