మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పతాకంపై జయ్ వల్లందాస్ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “మిస్టీరియస్” సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
కొత్త తరహా స్క్రీన్ ప్లేతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు మహి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించామని సహ నిర్మాతలు ఉషా, శివానీ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో రోహిత్, మేఘన రాజపుట్, అభిద్ భూషణ్, రియా కపూర్, కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, మరియు జబర్దస్త్ నటులు రాజమౌళి, నవీన్, లక్కీ ప్రధాన పాత్రలు పోషించారు.


