మిస్టీరియస్ సెన్సార్ పూర్తి, డిసెంబర్ 12న విడుదల

మిస్టీరియస్ సెన్సార్ పూర్తి, డిసెంబర్ 12న విడుదల

Published on Nov 25, 2025 6:00 PM IST

Mysterious

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పతాకంపై జయ్ వల్లందాస్ నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “మిస్టీరియస్” సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాను డిసెంబర్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

కొత్త తరహా స్క్రీన్ ప్లేతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని దర్శకుడు మహి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో నిర్మించామని సహ నిర్మాతలు ఉషా, శివానీ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో రోహిత్, మేఘన రాజపుట్, అభిద్ భూషణ్, రియా కపూర్, కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, మరియు జబర్దస్త్ నటులు రాజమౌళి, నవీన్, లక్కీ ప్రధాన పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు