మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ మార్చి 27 విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నా, దర్శకుడు బుచ్చిబాబు మాత్రం షూట్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇండిగో విమానాల సమస్యతో ఢిల్లీ షెడ్యూల్ వాయిదా పడినా, హైదరాబాద్‌లోని ముఖ్య లొకేషన్లలో చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి ఢిల్లీలో క్లైమాక్స్ షూట్ మొదలై, కుస్తీ ఫైట్ సహా మిగిలిన భాగం జనవరి మధ్య నాటికి పూర్తవుతుందని సమాచారం.
ఇప్పుడంతా ఏఆర్ రెహమాన్ ఐటెం సాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఆయన ఇప్పటికే ఇచ్చిన ట్యూన్స్ నచ్చకపోవడంతో కొత్తగా కంపోజ్ చేయడానికి అంగీకరించారని తెలుస్తోంది. ‘జిగేలు రాణి’ కంటే మెరుగైన పాట కావాలని బుచ్చిబాబు కోరుతుండటంతో కంపోజింగ్ కొంత ఆలస్యమైందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రెహమాన్ ఈ నెలలోపే ట్యూన్ ఇస్తే, ఫిబ్రవరిలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉందని టాక్.
కాగా ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వార్తలు పెద్దగా నిజం కాకపోవచ్చని సినీ సర్కిల్స్ టాక్. ఎందుకంటే బిజినెస్ డీల్స్, OTT ఒప్పందాలు అన్నీ మార్చి 27ను దృష్టిలో ఉంచుకుని ముగిశాయి. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా సినిమాను విడుదల చేయాలనే బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నారని.. దానికి నిర్మాతలు కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారు. చరణ్ కూడా డేట్ మిస్ కాకుండా పూర్తిగా సహకరిస్తున్నారు.


