అఫీషియల్: కార్తీ సినిమా కూడా చివరి నిమిషంలో రిలీజ్ నిలిపివేత!

అఫీషియల్: కార్తీ సినిమా కూడా చివరి నిమిషంలో రిలీజ్ నిలిపివేత!

Published on Dec 11, 2025 3:06 PM IST

కార్తీ Annagaru Vostaru

గత వారమే సరిగ్గా ఇదే సమయానికి బాలయ్య నటించిన అవైటెడ్ చిత్రం అఖండ 2 చివరి నిమిషం వరకు సస్పెన్స్ మైంటైన్ అవుతూ రిలీజ్ ఆగినట్టు క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారం కూడా మళ్ళీ అదే తరహాలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన చిత్రం ‘అన్నగారు వస్తారు’ కూడా వాయిదా పడినట్టు కన్ఫర్మ్ అయ్యింది.

ఈ సినిమాకి కూడా నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ వారికి ఫైనాన్సియల్ సమస్యలు ఉన్నాయని ఈ కారణంగా వాయిదా పడొచ్చు అనే రూమర్స్ వచ్చాయి. సో అవే నిజమయ్యి సినిమా రిలీజ్ అధికారికంగా వాయిదా వేసినట్టు యూఎస్ డిస్ట్రిబ్యూషన్ వారు కన్ఫర్మ్ చేశారు. దీనితో తెలుగు సహా తమిళ్ రెండు భాషల్లోని ఈ సినిమా థియేటర్స్ లో రేపు పడటం లేదట. దీనితో కార్తీ సినిమా కూడా చివరి నిమిషంలో ఆగిపోయింది అని చెప్పాలి. ఇక కొత్త డేట్ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు