ఇంకొక్క నెలలో మళ్ళీ సంక్రాంతి బాక్సాఫీస్ హవా మొదలైపోతుంది. తెలుగు సినిమా సహా దక్షణాది సినిమా దగ్గర బిగ్గెస్ట్ సినిమా ఫెస్టివల్ సీజన్ ఇది. మరి ఈ రేస్ లో ఆల్రెడీ మన తెలుగు సహా తమిళ్ నుంచి పలు సినిమాలు లాక్ అయ్యి ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాలు ఒకో స్టార్ హీరో ఒకో డేట్ ని లాక్ చేసుకున్నారు. అయితే మొదటిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇంకా దళపతి విజయ్ లు తమ అవైటెడ్ సినిమాలు ది రాజా సాబ్ (The Rajasaab) ఇంకా జన నాయకుడు (Jana Nayakudu) సినిమాలతో ఒకే డేట్ లో జనవరి 9న క్లాష్ కి రాబోతుండగా ఇదే డేట్ లో మరో యంగ్ హీరో క్లాష్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
Siva Karthikeyan Parashakti Date – డేట్ మార్చుకున్న యంగ్ హీరో..?
ఆల్రెడీ సంక్రాంతి బరిలో తమిళ హీరో విజయ్ తో పాటుగా శివ కార్తికేయన్ కూడా ఉన్నాడు. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి సినిమా పొంగల్ రేస్ లోనే ఫిక్స్ చేశారు కానీ ఇప్పుడు అనుకున్న డేట్ కంటే ముందే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయట. దీనితో జనవరి 9 లేదా 10గా మేకర్స్ అనుకుంటున్నారట.
ప్రభాస్, విజయ్ లకి పోటీగా శివ కార్తికేయన్
జనవరి 9 డేట్ లో విజయ్ జన నాయకుడు, ప్రభాస్ రాజా సాబ్ లు ఆల్రెడీ ఫిక్స్ అయ్యాయి. సో ఆ డేట్ లో ఆ సినిమాల మధ్యే టఫ్ కాంపిటీషన్ అంటే ఇప్పుడు మూడో సినిమాగా శివ కార్తికేయన్ పరాశక్తి తో రాబోతున్నాడట. అయితే దీనికి జరిగిన బిజినెస్ ఇంకా ఇతర కారణాలు రీత్యా మేకర్స్ ఆ రెండు డేట్స్ ని చూస్తున్నారట. సో ప్రభాస్, విజయ్ లతో శివ కార్తికేయన్ క్లాష్ తప్పేలా లేదని చెప్పక తప్పదు.
ఫైనల్ గా దీనిపై ఓ అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇక శివ కార్తికేయన్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఆకాష్ భాస్కరన్ నిర్మాణం వహిస్తున్నారు.


