ఈ వారం ఓటీటీ/థియేటర్‌లలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే..!

ఈ వారం ఓటీటీ/థియేటర్‌లలో సందడి చేయబోతున్న సినిమాలు ఇవే..!

Published on Dec 15, 2025 1:06 PM IST

ott

ప్రతి వారం లాగే, ఈ వారం కూడా థియేటర్లలో పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.

హాలీవుడ్ విజువల్ వండర్ చిత్రం ‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. పలు ఇండియన్ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఈ చిత్రంపై మంచి హైప్ నెలకొంది. ఇక టాలీవుడ్‌ నుండి ‘గుర్రం పాపిరెడ్డి’, ‘సఃకుటుంబానాం’, ‘మిస్‌టీరియస్’ వంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.

ఇక ఓటీటీలో కూడా ఈ వారం పలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా రిలీజ్ కానున్నాయి. మరి ఏయే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏయే సినిమాలు/వెబ్ సిరీస్‌లు వస్తున్నాయో ఇక్కడ చూద్దాం.

ఈటీవీ విన్ :

రాజు వెడ్స్ రాంబాయి – డిసెంబర్ 18

నెట్‌ఫ్లిక్స్ :

ఎమిలీ ఇన్ పారిస్ 5 (వెబ్ సిరీస్ ) – డిసెంబర్ 18
ప్రేమంటే – డిసెంబర్ 19
రాత్ అఖేలీ హై 2 – డిసెంబర్ 19

అమెజాన్ ప్రైమ్ వీడియో :

థామా – డిసెంబర్ 16
ఎక్ దివానే కీ దివానియత్ – డిసెంబర్ 16
ఫాలౌట్ (వెబ్ సిరీస్) – డిసెంబర్ 17
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజన్ 4(వెబ్ సిరీస్) – డిసెంబర్ 19

జియో హాట్‌స్టార్ :

మిసెస్ దేశ్‌పాండే (వెబ్ సిరీస్) – డిసెంబర్ 19

జీ5 :

నయనం (తెలుగు వెబ్ సిరీస్) – డిసెంబర్ 19
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ – డిసెంబర్ 19

సన్‌నెక్స్ట్ :

దివ్య దృష్టి – డిసెంబర్ 19

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు