బాలీవుడ్‌లో తెరకెక్కిన లేటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాను ఆదిత్యధర్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తోంది.
అయితే, ఈ సినిమాలో రణ్‌వీర్ పాకిస్తాన్‌లో ఇండియన్ స్పైగా కనిపిస్తాడు. ఇప్పుడు దీనిని కాపీ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ‘ఫస్ట్ డే యాజ్ ఏ స్పై ఇన్ పాకిస్తాన్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బోలెడన్నీ కామడీ రీల్స్, మీమ్స్ సందడి చేస్తున్నాయి. ప్రేక్షకులు రణ్‌వీర్ చేసిన పాత్రకు బాగా కనెక్ట్ కావడంతో ఈ మీమ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించగా వెర్సటైల్ యాక్టర్ అక్షయ్ ఖన్నా విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటి దుమ్ములేపుతుంది.


