3000 కోట్ల సంచలన ఓపెనింగ్స్ పై కన్నేసిన ‘అవతార్ 3’

3000 కోట్ల సంచలన ఓపెనింగ్స్ పై కన్నేసిన ‘అవతార్ 3’

Published on Dec 18, 2025 8:18 AM IST

Avatar 3

ప్రస్తుతం పాన్ వరల్డ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమానే “అవతార్: ది ఫైర్ అండ్ యాష్”. దర్శకుడు జేమ్స్ కేమెరూన్ తెరకెక్కించిన ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఆల్రెడీ పలు దేశాల్లో మొదలైంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఒక భారీ ఓపెనింగ్ ని కన్నేసినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ ఈ సినిమా ఈజీగా 340 మిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ తో మొదలవుతుందట.

దీనితో మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 3000 కోట్లకి పైగా గ్రాస్ తో మొదలు కానుంది అని చెప్పాలి. ఇక అంతా కుదిరి టాక్ గాని పడితే మాత్రం లాంగ్ రన్ కి ఆకాశమే హద్దు. గత 2 సినిమాలు కూడా 2 బిలియన్ కి పైగానే వసూళ్లు రాబట్టాయి. ఇక ఈ సినిమాకి ఏ స్థాయిలో వసూళ్లు వస్తాయో అనేది వేచి చూడాల్సిందే. మరి ఇండియాలో అయితే రేపు డిసెంబర్ 19 నుంచి పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు