నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది పారడైజ్’. ఈ చిత్రంలో నాని ‘జడల్’ అనే మాస్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. కాగా, ఈ సినిమాలో జడల్ చిన్నప్పటి పాత్రలో నటించిన చైల్డ్ యాక్టర్ అఖిర నందన్ తాజాగా నానితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పిక్‌లో హీరో నాని పక్కన అఖిర నందన్ నవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో వీరిద్దరూ ఒకే పాత్ర తాలూకు వేర్వేరు వయసుల రూపాలను పోషించడంతో, బడా జడల్, చోటా జడల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఈ ఫొటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్
ఈ ఫొటోకు “Chota Jadal × Jadal × SrikanthSir × Amma = THEPARADISE” అంటూ అఖిర ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించారు. ఈ చిత్రంలో తనకు మంచి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు శ్రీకాంత్ ఒదెలతో పాటు హీరో నాని, హీరోయిన్ కయాదు లోహర్, కీర్తి సురేష్ తదితరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
చిన్న వయసులోనే నాని చిత్రంలో కీలక పాత్ర పోషించి మెప్పించిన అఖిర నందన్‌కు నెటిజన్లు కామెంట్ల రూపంలో అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పిక్ చక్కర్లు కొడుతోంది.


