Avatar 3 : ఇండియాలోనే బిగ్గెస్ట్ 2025 హాలీవుడ్ ఓపెనర్‌గా ‘అవతార్ 3’ వసూళ్లు

Avatar 3 : ఇండియాలోనే బిగ్గెస్ట్ 2025 హాలీవుడ్ ఓపెనర్‌గా ‘అవతార్ 3’ వసూళ్లు

Published on Dec 20, 2025 4:10 PM IST

Avatar 3

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Avatar Fire And Ash) బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి రెండు భాగాలు గ్లోబల్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో ఇప్పుడు ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక 2025లో భారతదేశంలో విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లోనే అతిపెద్ద ఓపెనర్‌గా ‘అవతార్ 3’(Avatar 3) నిలిచింది. ఈ సినిమాలోని స్కేల్‌, భావోద్వేగాలు, విజువల్ అనుభూతి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గ్లోబల్‌గా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుండగా భారత్‌లో రికార్డు స్థాయి ఓపెనింగ్ నమోదు చేసింది.

అదరగొట్టిన ‘అవతార్ 3’ వసూళ్లు..

ఈ ఏడాది హాలీవుడ్ సినిమాలకే అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసిన చిత్రాల్లో ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Avatar 3) ముందంజలో నిలిచింది. తొలి శుక్రవారం అన్ని భాషల్లోనూ భారీ థియేట్రికల్ రెస్పాన్స్ అందుకుంది. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో దీనికి వస్తున్న రెస్పాన్స్ చూస్తే అర్థమవుతుంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సాలిడ్ రెస్పాన్స్ అందుకుంటూ దూసుకెళ్తోందని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.

తొలి రోజు ‘అవతార్ 3’ భారీ ఓపెనింగ్స్..

‘అవతార్: ఫైర్ అండ్ యాష్’(Avatar 3)తో పాటు ఇతర భారీ చిత్రాల ప్రభావంతో ఒకే రోజులో ₹50 కోట్లకు పైగా వసూళ్లు నమోదు కావడం విశేషం. ఇక ఇందులో అవతార్ 3 చిత్రం దాదాపు రూ.20 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో అవతార్ 3 ఇంకా ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు