‘ఈషా’ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిమ్మలను చాలా కాలం వెంటాడుతుంది: హీరో శ్రీవిష్ణు

‘ఈషా’ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ మిమ్మలను చాలా కాలం వెంటాడుతుంది: హీరో శ్రీవిష్ణు

Published on Dec 24, 2025 6:02 PM IST

Eesha

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ సమర్పణలో కేఎల్ దామోదర ప్రసాద్ పర్యవేక్షణలో రూపొందిన హారర్ చిత్రం ‘ఈషా’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్‌రాజ్‌ త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తుండగా హెబ్బా పటేల్‌ హీరోయిన్. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించగా హీరో శ్రీవిష్ణు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు.

ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “నాకు వ్యక్తిగతంగా హారర్ సినిమాలంటే చాలా ఇష్టం. ఫ్రెండ్స్‌తో కలిసి చూసినప్పుడు ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ‘ఈషా’ సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా కాలం పాటు ప్రేక్షకులను వెంటాడుతుంది. దర్శకుడు శ్రీనివాస్ మన్నె కథల్లో ఎప్పుడూ నావెల్టీ ఉంటుంది. ఈ కథలో కూడా మంచి ట్విస్టులు ఉన్నాయి. దామోదర ప్రసాద్ గారు, బన్నీ వాసు, వంశీ నందిపాటి లాంటి టీమ్ సపోర్ట్ ఉండటం ఈ సినిమాకు పెద్ద ప్లస్” అన్నారు.

నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ.. “ఈ సినిమా చూస్తుంటే నాకే వెనక్కి తిరిగి చూసుకోవాలనిపించేంత భయం కలిగింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు అందరినీ షాక్‌కు గురిచేస్తాయి. హారర్ లవర్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. మీ భయపడే గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పకుండా ఈ సినిమాకు తీసుకెళ్ళండి” అని నవ్వుతూ చెప్పారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ.. “శ్రీవిష్ణు గారు మాకు లక్కీ హ్యాండ్. ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడమే కాదు, ఒక మంచి మెసేజ్ కూడా ఇస్తున్నాం. ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా కేవలం 99 రూపాయలకే డిసెంబర్ 24న ప్రీమియర్ షోలు ప్లాన్ చేశాం” అని తెలిపారు.

ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులకు చేరువవుతాయని, బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని అద్భుతంగా ప్రమోట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోలు అఖిల్ రాజ్, త్రిగుణ్, దర్శకుడు శ్రీనివాస్ మన్నె తదితరులు పాల్గొని సినిమా విజయంపై ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు