పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ‘అమరావతికి ఆహ్వానం’.. కొత్త పోస్టర్ విడుదల.

పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ‘అమరావతికి ఆహ్వానం’.. కొత్త పోస్టర్ విడుదల.

Published on Dec 26, 2025 8:00 AM IST

a 10

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇదే జోనర్‌లో హారర్, సస్పెన్స్ కథాంశంతో ‘అమరావతికి ఆహ్వానం’ చిత్రం రూపొందుతోంది. శివ కంఠంనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తర్, సుప్రీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు జివికె దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై ముప్పా వెంకయ్య చౌదరి నిర్మాణ సారథ్యంలో, కేఎస్ శంకర్ రావు మరియు ఆర్. వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోని పలు లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. క్రిస్మస్ సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను, గ్లింప్స్‌ను విడుదల చేసింది. సినిమా టైటిల్‌కు ఇప్పటికే మంచి స్పందన లభించిందని మేకర్స్ తెలిపారు.

ఈ సందర్భంగా హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ.. దర్శకుడు జివికె విజన్‌తో సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చిందని, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ (VFX) పనులు జరుగుతున్నాయని తెలిపారు. జె. ప్రభాకర్ రెడ్డి విజువల్స్, పద్మనాబ్ భరద్వాజ్ సంగీతం సినిమాకు ప్లస్ అవుతాయని దర్శకుడు పేర్కొన్నారు. త్వరలోనే ప్రచార కార్యక్రమాలు నిర్వహించి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు