‘శంబాల’ పై ‘రాజాసాబ్’ ఇన్స్టా పోస్ట్.. ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్

‘శంబాల’ పై ‘రాజాసాబ్’ ఇన్స్టా పోస్ట్.. ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్

Published on Dec 28, 2025 7:07 PM IST

prahas 1

లేటెస్ట్ గా క్రిస్మస్ కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చి మంచి సక్సెస్ అందుకున్న సినిమానే “శంబాల”(Shambala). ఆది సాయి కుమార్ హీరోగా గత కొంత కాలం నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమా సాలిడ్ వసూళ్ళని రాబడుతూ స్ట్రాంగ్ వీకెండ్ ని ప్రామిస్ చేస్తుంది.

అయితే ఈ సినిమా సక్సెస్ పై లేటెస్ట్ గా రెబల్ సాబ్, వచ్చే నెల రాబోతున్న రాజా సాబ్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెబుతూ మరింత బూస్టప్ అందించారు. ఒక ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ కొట్టినందుకు ఆది అండ్ టీం కి కంగ్రాట్స్ చెబుతున్నాను అని ప్రభాస్ తెలిపారు.

దీనితో తన విషెస్ వైరల్ గా మారాయి. ఇక ఈ మిస్టరీ థ్రిల్లర్ లో అర్చన అయ్యర్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ తదితరులు నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. అలాగే మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభిమోజులు నిర్మాణం వహించారు.

sh

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు