విడుదల తేదీ : జూలై 31, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సమైరా, శరణ్య ప్రదీప్, అభిరామి, సముద్రకని, ఆనంద్, వైష్ణవ్, ధనరాజ్ తదితరులు
దర్శకత్వం : అభినయ కృష్ణ (అదిరే అభి)
సంగీతం : జ్ఞాని
నిర్మాతలు : వడ్డేపల్లి శ్రీ వాణి నాథ్, యశ్వంత్ రాజు
సినిమాటోగ్రఫీ : కుషేందర్ రమేష్ రెడ్డి
ఎడిటింగ్ : వర ప్రసాద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో అదిరే అభి (అభినయ కృష్ణ) తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘కర్మాఖ్య’ కూడా ఒకటి. ట్రైలర్ తో ఆసక్తి రేపిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
వైజాగ్ శివార్లలో తన ఫ్రెండ్ ప్రవల్లిక (శరణ్య ప్రదీప్) వెళ్లాల్సిన ఓ ఇన్సూరెన్స్ పనికి ఆమె బదులు మరో అమ్మాయి ? (సమైరా) ఓ ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఉండే ఫ్యామిలీ సరోజిని (అభిరామి) తన భర్త ప్రభాకర్ (ఆనంద్) అలాగే ఓ మతిస్థిమితం సరిగా లేని కొడుకు సాత్విక్ (వైష్ణవ్) లతో ఉంటారు. వీరి ఇంటికి వెళ్లిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ ఊహించని విధంగా లాక్ అవుతుంది. ఇంకోపక్క ఒక అవినీతి పరుడైన పోలిస్ తిరుపతి (సముద్రకని) దొరికిన చోటంతా డబ్బు గడిస్తూ ఈ కేసులోకి వస్తాడు. అసలు ఆ కుటుంబం ఆమెని ఎందుకు బంధించారు? ఆమెని వారు ఏం చెయ్యాలి అనుకున్నారు? ప్రవల్లిక గతం ఏంటి ఆమె ఎందుకు కావాలని ఆ అమ్మాయి లైఫ్ లోకి వెళుతుంది? చివరికి ఆ అమ్మాయి బతికిందా లేదా అసలు ఆమె పేరు ఏంటి? అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఇటీవల టాలీవుడ్ లో కొనసాగుతున్న థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నుంచి ఇది మరో కొత్త కాన్సెప్ట్ తో కూడిన థ్రిల్లర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందులో దర్శకుడు అభి ఎంచుకున్న కోర్ కాన్సెప్ట్ ఇంప్రెస్ చేస్తుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్న కథనం కానీ ట్విస్ట్ లు గాని సెకండాఫ్ లో ఒకోకటి రివీల్ చేస్తూ తీసుకెళ్లడం ఈ తరహా థ్రిల్లర్ సినిమాలని చూసే ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది.
ముఖ్యంగా సినిమాలో సెకండాఫ్ ఆయువు పట్టుగా నిలిచింది అని చెప్పవచ్చు. కథనంలోకి వెళ్ళాక అందులో మరింత లోతుకు వెళుతున్న క్రమంలో కనిపించే ట్విస్ట్ లు, థ్రిల్ మూమెంట్స్ బాగున్నాయి. ఇదే క్రమంలో కొందరు నటీనటులు మాత్రం సాలిడ్ పెర్ఫామెన్స్ లతో కథనంకి మరింత బలం చేకూర్చారు.
ముఖ్యంగా నటి అభిరామి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ తరహా డార్క్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించలేదు. అంతే రీతిలో ఆమె పెర్ఫామెన్స్ కూడా సినిమాలో చాలా బాగుంది. తనపై ఫస్టాఫ్ లో ట్విస్ట్ కూడా వర్కవుట్ అయ్యింది. ఇక మరో నటి శరణ్య ప్రదీప్ ఈ సినిమాలో పూర్తిగా సర్ప్రైజ్ పాక్ అని చెప్పవచ్చు.
ఇది వరకు ఒక పక్కింటి అమ్మాయిగా చాలా సాఫ్ట్ పాత్రల్లో కనిపించి ఇందులో ఆమె మాత్రం మరో కోణాన్ని చూపించి డెఫినెట్ గా సర్ప్రైజ్ చేసింది. వీరితో పాటుగా హీరోయిన్ సమైరాకి ఇదొక నీట్ డెబ్యూ అని చెప్పవచ్చు. ఆమె తన పాత్రలో బాగా సెట్ అయ్యింది. సెటిల్డ్ పెర్ఫామెన్స్ ని ఆమె చేసింది. వీరితో పాటుగా సముద్రకని తన రోల్ లో మెప్పించారు. క్లైమాక్స్ లో తన రోల్ కథనాన్ని మరింత ఎంగేజింగ్ గా మార్చింది. ఇక మిగతా నటీనటులు ఫ్లాష్ బ్యాక్ లో మధునందన్, ప్రెజెంట్ ఆనంద్, వైష్ణవ్, ధనరాజ్ అంతా తమ పాత్రల పరిధి మేరకు బాగా చేశారు.
మైనస్ పాయింట్స్:
ఇందులో ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తదే కావచ్చు కానీ కొన్ని చోట్ల ట్రీట్మెంట్ కొన్ని సీన్స్ విరూపాక్ష షేడ్స్ లో కనిపిస్తాయి. సో పూర్తి స్థాయిలో కొత్తదనమే కావాలి అనుకునేవారికి కొంచెం ఇది డల్ అనిపించవచ్చు. అలాగే ఇందులో మరింత థ్రిల్ మూమెంట్స్ ని యాడ్ చేసినా మరింత బాగుండేది.
అలానే సముద్రకని లాంటి వెర్సటైల్ నటుడు ఎలాగో వర్క్ చేశారు కాబట్టి తనని ఇంకా ఎక్కువ వినియోగించాల్సింది. సెకండాఫ్ లో చాలా వరకు తన ప్రెజెన్స్ మిస్ అయ్యింది అనిపిస్తుంది. అలానే క్లైమాక్స్ పోర్షన్ లో అభిరామి, ఆనంద్ లపై ఇంకాస్త డ్రామా యాడ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా ఫస్టాఫ్ ని మరింత ఎంగేజింగ్ గా మలచి ఉంటే బాగుండు.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. ఇందులో సంగీత దర్శకుడు జ్ఞాని వర్క్ మాత్రం చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి కానీ సినిమాకి కావాల్సిన సస్పెన్స్, థ్రిల్ సన్నివేశాల్లో తన స్కోర్ ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ఈశ్వర్ పెంటి కెమెరా వర్క్ బాగుంది. శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగానే ఉంది.
ఇక దర్శకుడు అభినయ కృష్ణ విషయానికి వస్తే.. తనకిది థియేట్రికల్ గా రెండో సినిమా అయినప్పటికీ తన వర్క్ డీసెంట్ గా ఉందని చెప్పవచ్చు. కొన్ని కామెడీ సీన్స్ తో పాటుగా ఇంప్రెస్ చేసే కథనాన్ని డిజైన్ చేసుకున్న విధానం, ఎక్కడ ఏ డీటెయిల్ వదలాలి, ఏ ట్విస్ట్ రివీల్ చేయాలి అనే క్లారిటీతో తెరకెక్కించారు. హీరోయిన్ కి ఒక హీరో ఉండాలి ఇలాంటి అనవసర నస లేకుండా క్లీన్ గా తీసుకెళ్లారు. ముఖ్యంగా సెకండాఫ్ లో కథనం తను బాగా హ్యాండిల్ చేసారు. సో ఓవరాల్ గా తన వర్క్ ఈ సినిమాకి మెప్పిస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ ‘కర్మాఖ్య’ సినిమాలో అక్కడక్కడా ఎంగేజ్ చేసే థ్రిల్ ఎలిమెంట్స్ బాగా ఆకట్టుకుంటాయి. నటీనటుల పెర్ఫామెన్స్ లను దర్శకుడు అభినయ కృష్ణ బాగా రాబట్టారు. అలానే సెకండాఫ్ ని కూడా బాగా హ్యాండిల్ చేశారు. కానీ ఫస్టాఫ్ లో కూడా ఈ మూమెంటం పూర్తి స్థాయిలో ఉంటే బాగుండేది. ఇవి పక్కన పెడితే ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఈ జానర్ సినిమాలని ఇష్టపడేవారికి నచ్చుతుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


