పిక్ టాక్ : కియారాకు సిద్ధార్థ్ బర్త్ డే విషెస్.. ఐస్ క్రీమ్ దొంగ అయినా స్పెషలే..!

పిక్ టాక్ : కియారాకు సిద్ధార్థ్ బర్త్ డే విషెస్.. ఐస్ క్రీమ్ దొంగ అయినా స్పెషలే..!

Published on Jul 31, 2026 11:14 PM IST

బాలీవుడ్ లవ్లీ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఈ జోడీకి ప్రేక్షకుల నుంచి అపారమైన ప్రేమ లభిస్తుంది. కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన స్పెషల్ బర్త్‌డే విష్ ప్రస్తుతం అభిమానుల మనసులు దోచుకుంటోంది.

తన ప్రియమైన భార్య పై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ.. ‘నా ఐస్‌క్రీమ్ దొంగిలించి తిన్నా సరే, నా ప్రతి రోజును తీపి జ్ఞాపకం గా మార్చే నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ అత్యంత ప్రేమగా, చిలిపిగా విష్ చేశాడు సిద్ధార్థ్. వీరిద్దరి మధ్య ఉన్న ఈ సరదా ప్రేమను చూసి అభిమానులు, సినీ ప్రముఖులు కియారాకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు