‘లెనిన్’ అవుట్ ఫుట్ పై నిర్మాత క్లారిటీ !

‘లెనిన్’ అవుట్ ఫుట్ పై నిర్మాత క్లారిటీ !

Published on Dec 29, 2025 7:00 AM IST

Lenin

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఈ సినిమా గురించి నిర్మాత నాగవంశీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘లెనిన్ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా అవుట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం, ఈ సారి కచ్చితంగా అఖిల్ హిట్ కొట్టబోతున్నాడు’ అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఓ చిన్న అతిధి పాత్రలో ఓ హీరోయిన్ కనిపిస్తోందట.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు