ప్రేక్షకులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ‘లవ్ జాతర’ టీమ్

ప్రేక్షకులకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన ‘లవ్ జాతర’ టీమ్

Published on Jan 1, 2026 9:00 AM IST

love

అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ జాతర’ (Love Jathara). ‘సమ్మతమే’ చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు గోపీనాథ్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా చిత్ర బృందం తెలుగు ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేసింది.

యూజీ క్రియేషన్స్ (UG Creations) పతాకంపై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి రోలర్ కోస్టర్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా, ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా, సుజాత సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త సంవత్సరంలో ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు