Eko in Telugu: తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్!

Eko in Telugu: తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్!

Published on Jan 3, 2026 7:05 AM IST

Eko OTT Review

చాలా రోజుల తర్వాత మలయాళ సినిమా నుంచి మళ్లీ ఓ సినిమా కోసం జనం గట్టిగా మాట్లాడుకుంటున్నారు. మరి ఆ సినిమానే “ఎకో(Eko)”. యువ హీరో సందీప్ ప్రదీప్ హీరోగా దర్శకుడు దింజిత్ అయ్యథాన్ తెరకెక్కించిన ఈ సాలిడ్ థ్రిల్లర్ థియేటర్స్ లో బ్లాస్టింగ్ హిట్ అయ్యింది. మరి థియేటర్స్ లో చూసిన జనంకి ఒక సర్ప్రైజింగ్ ట్రీట్ ని ఇది అందించగా రీసెంట్ గానే మొదట మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కి వచ్చింది.

ఇక అక్కడ నుంచి జనం మరింత మాట్లాడుకున్నారు. కానీ ఫైనల్ గా ఈ సినిమా ఈ రోజు నుంచి తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇదే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా పానిండియా భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఇప్పుడు అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నట్టే అని చెప్పాలి. ఇక అందరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ని ఈ సినిమా అందుకుంటుందో చూడాల్సిందే.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

తాజా వార్తలు