పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో బెల్లంకొండ శ్రీను ‘హైందవ’

పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో బెల్లంకొండ శ్రీను ‘హైందవ’

Published on Jan 3, 2026 2:01 PM IST

haindava

గత ఏడాది మంచి హిట్స్ అందుకున్న యువ హీరోస్ లో సాలిడ్ హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ తో వచ్చి ఆకట్టుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఒకరు. మరి ఆ హిట్ తర్వాత మరో సాలిడ్ థ్రిల్లర్ ని తాను తీసుకురాబోతున్నాడు. మరి ఆ చిత్రమే “హైందవ”. ప్రీ లుక్ పోస్టర్స్ తోనే మంచి బజ్ ని రేకెత్తించిన ఈ సినిమా నుంచి ఇప్పుడు పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

ఒక చేతిలో గొడ్డలి మరో చేతిలో కాగడా బ్యాక్గ్రౌండ్ లో వరాహం, దాని కొమ్ములు హీరోకే మొలిచినట్టు పర్ఫెక్ట్ గా దీనిని డిజైన్ చేసి వదిలారు. దీనితో మంచి రెస్పాన్స్ ఇప్పుడు ఆడియెన్స్ లో వస్తుంది. అంతే కాకుండా అతను ఒంటరి వాడు కాదు అతనికి అండగా ఆ దశావతారాలే ఉన్నారు అంటూ ఇచ్చిన క్యాప్షన్ కూడా రెట్టింపు ఆసక్తిని పెంచుతుంది. ఇలా మొత్తానికి దర్శకుడు మహేష్ చందు సాలిడ్ సబ్జెక్టుతో వస్తున్నట్టుగా అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా మూన్ షైన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు