మాసివ్ ప్రమోషన్స్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 9 రోజులు 9 ప్రాంతాలు

మాసివ్ ప్రమోషన్స్ తో ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 9 రోజులు 9 ప్రాంతాలు

Published on Jan 3, 2026 5:00 PM IST

మన శంకర వరప్రసాద్ గారు

తన సినిమాని మార్కెట్ లోకి తీసుకెళ్లడంలో ఒకో దర్శకునికి ఒకో స్టైల్ ఉంటుంది. మరి అలా తన సినిమాలకి అంటూ ఒక సెపరేట్ మార్క్ ని సెట్ చేసుకున్న దర్శకుల్లో అనీల్ రావిపూడి కూడా ఒకరు. ఇప్పుడు తాను చేస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) కి కూడా సాలిడ్ ప్రమోషన్స్ ని లాక్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లానింగ్ ఇలా ఉంది.

9 రోజులు 9 ప్రాంతాలు 9 డిఫరెంట్ ప్లానింగ్స్

ఈ సినిమా కోసం మాసివ్ ప్రమోషన్స్ కి మేకర్స్ పూనుకున్నారు. 9 రోజుల్లో 9 ప్రాంతాల్లో డిఫరెంట్ ప్లానింగ్స్ తో రాబోతున్నారు. ఈ 3 నుంచే మొదలైన ఈ ప్లానింగ్ వరుసగా 11వ తేదీ వరకు సాగుతుంది.

ఏయే ప్రాంతాల్లో అంటే

మన శంకర ప్రసాద్ గారు రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, హైదరాబాద్ తాడేపల్లిగూడెం, అనంతపూర్, వరంగల్ చివరిగా బెంగళూరు ప్రాంతాల్లో మొత్తం 3 నుంచి 11 వరకు మాసివ్ ప్లానింగ్ తో వెళ్లబోతుంది.

Rumors on Chiranjeevi – ప్రమోషన్స్ కోసం మెగాస్టార్, నయన్ కూడా

ఈ సినిమా ప్రమోషన్స్ కి చిరంజీవి (Chiranjeevi) రారు అంటూ కొన్ని రూమర్స్ వచ్చాయి కానీ అందులో నిజం లేదు. చిరంజీవి హాజరు అవుతుండగా ఈ సినిమా కోసం ఎప్పుడూ ప్రమోషన్స్ ఈవెంట్స్ కి కూడా హాజరు కానీ నయనతార (Nayanthara) కూడా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం వస్తున్నారు.

తాజా వార్తలు