జెట్‌లీ గ్లింప్స్ : మరోసారి ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ అందించనున్న సత్య.. ఈసారి ఏకంగా గాల్లోనే..!

జెట్‌లీ గ్లింప్స్ : మరోసారి ఫన్ రోలర్ కోస్టర్ రైడ్ అందించనున్న సత్య.. ఈసారి ఏకంగా గాల్లోనే..!

Published on Jan 3, 2026 6:32 PM IST

Jetlee

టాలీవుడ్ కమెడియన్ సత్య లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జెట్‌లీ’(Jetlee) ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ‘మత్తు వదలరా’ చిత్రాన్ని రూపొందించిన రితేష్ రానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సత్య హీరోగా నటిస్తుండగా ఈ మూవీ ఎలాంటి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌తో మేకర్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చారు.

తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. సరికొత్త గెటప్‌లో సత్య మరోసారి ఔట్ అండ్ ఔట్ ఫన్ రైడ్ చేయబోతున్నాడు. జెట్‌లీ మూవీలో రియా సింఘ హీరోయిన్‌గా నటిస్తోండగా ఆమె స్టైలిష్ స్టంట్స్‌తో ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక సత్య, వెన్నెల కిషోర్ తమదైన కామెడీ టైమింగ్‌తో ఎలాంటి ఫన్ క్రియేట్ చేయబోతున్నారో ఈ గ్లింప్స్‌లో శాంపిల్ చూపెట్టారు.

నువ్వు హీరోవా.. అని వెన్నెల కిషోర్ ప్రశ్నకు అవును అంటూ సమాధానం ఇచ్చాడు సత్య. టైర్ వన్, టైర్ టు, టైర్ త్రీయా.. అని వెన్నెల కిషోర్ ప్రశ్నిస్తాడు. దీనికి సత్య తనదైన టైమింగ్‌తో జనరల్ కంపార్ట్‌మెంట్ అంటూ ఇచ్చే సమాధానం నవ్వులు తెప్పిస్తుంది. ఒక విమానంలో ఈ చిత్ర కథ జరగనుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తుండగా క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు