దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ‘వారణాసి’ (Varanasi) ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. పైగా ‘వారణాసి’ (Varanasi) చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. ఐతే, తాజా సమాచారం ప్రకారం, అభిమానులను ఉర్రూతలూగించబోతున్న ఈ సినిమా ‘ఎనౌన్స్ మెంట్ టీజర్’ ఇప్పుడు చరిత్ర సృష్టించబోతోంది. పారిస్‌లోని ‘లే గ్రాండ్ రెక్స్’లో ఈ ‘ఎనౌన్స్ మెంట్ టీజర్’ ను ప్రదర్శించనున్నారు.
కాగా ఇలా ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘వారణాసి’ నిలవబోతోంది. ఈ ప్రదర్శన జనవరి 5, 2026న రాత్రి 9 గంటలకు జరగనుంది. భారతీయ చిత్రాల ఫ్రెంచ్ పంపిణీ సంస్థ ‘ఆన్నా ఫిల్మ్స్’ ఈ వార్తను అధికారికంగా ధృవీకరించింది. పైగా పెద్ద తెరపై ఈ టీజర్‌ను అత్యున్నత ఫార్మాట్లో ప్రదర్శించనున్నారు. కాగా రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ, దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు.


