ప్రస్తుతం బాలీవుడ్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న అవైటెడ్ భారీ సినిమానే రామాయణ. దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ ఇతిహాస కావ్యం కోసం వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన ట్రైలర్ కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ ట్రైలర్ ఇపుడు సంచలన రెస్పాన్స్ ని నమోదు చేసినట్లు తెలుస్తోంది.
కేవలం 4 రోజుల్లో రామాయణ ట్రైలర్ ఏకంగా 800 మిలియన్ వ్యూస్ ని రాబట్టినట్టు తెలుస్తోంది. ఇది మాత్రం సంచలన ఫీట్ అనే చెప్పాలి. అయితే ఇది కేవలం యూట్యూబ్ నుంచే కాకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి కలిపి అన్నట్టు తెలుస్తోంది. సో రామాయణ ట్రైలర్ కి ఇలా భారీ రెస్పాన్స్ నమోదు అయింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నమిత్ మల్హోత్రా నిర్మాణం వహిస్తున్నారు.


