టీజర్ టాక్: సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చిన సమంత ‘మా ఇంటి బంగారం’

టీజర్ టాక్: సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చిన సమంత ‘మా ఇంటి బంగారం’

Published on Jan 9, 2026 1:57 PM IST

Maa-Inti-bangaram

స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా కోసం అందరికీ తెలిసిందే. టాలెంటెడ్ లేడీ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమే ‘మా ఇంటి బంగారం’. కొన్నాళ్ల కితమే అనౌన్స్ చేసిన ఈ సినిమా ఫైనల్ గా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా షూట్ మొదలైంది.

మరి ఈ సంక్రాంతికి ముందే కానుకగా మేకర్స్ రీసెంట్ గానే టీజర్ ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఫైనల్ గా ఈ టీజర్ ని విడుదల చేశారు. అయితే ఇది మాత్రం సాలిడ్ ట్రీట్ ని అందించి సర్ప్రైజ్ గా నిలిచింది అని చెప్పొచ్చు.

ఇందులో సమంత ఒక కుటుంబంలోకి ఒక మెత్తనైన కోడలిగా ఎంటర్ అయ్యాక నెమ్మదిగా మొదలైన థింగ్స్ మెల్లగా ఆమె నుంచి చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం కేజ్రీగా ఉందని చెప్పాలి. సమంత నుంచి ఊహించని యాక్షన్ లతో అదరగొట్టేసింది అని చెప్పొచ్చు. అలాగే ఇందులో శ్రీముఖికి కూడా ఇంట్రెస్టింగ్ రోల్ దక్కినట్టు తెలుస్తుంది. దీనితో ఈ సినిమాతో మేకర్స్ సాలిడ్ ట్రీట్ ని ప్లాన్ చేస్తున్నారు అని అర్ధం కావచ్చు.

తాజా వార్తలు