ఓటిటి సమీక్ష: ‘మళ్ళీ వచ్చిన వసంతం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘మళ్ళీ వచ్చిన వసంతం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Jan 12, 2026 5:27 PM IST

Malli-Vachina-Vasantham

విడుదల తేదీ : జనవరి 11, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : తేజ, కశ్వి తదితరులు
దర్శకత్వం : శరణ్య తేజు
నిర్మాణం : రా ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి
సంగీతం : సాకేత్ కోమండూరి
సినిమాటోగ్రఫీ : శేఖర్ గంగానమోని

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

తెలుగు పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘మళ్ళీ వచ్చిన వసంతం'(Malli Vachina Vasantham). వీక్లీ సిరీస్ కథా సుధ నుంచి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న అభి (తేజ) అప్పటికే ఒక బ్రేకప్ తో పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాడు. ఈ క్రమంలో ఆల్రెడీ పెళ్ళైన అమ్మాయి
శశి (కశ్వి) తన టీంలో జాయిన్ అవుతుంది. ఈమె వచ్చాక అభి లైఫ్ లో వచ్చిన మార్పు ఏంటి? ఆమె ఎవరు? ఇద్దరికీ మధ్య ముందే ఏమన్నా సంబంధం ఉందా? మరి ఆల్రెడీ పెళ్ళైన ఆమెతో ప్రయాణం ఎలా ముందుకు వెళుతుంది అనేది ఇందులో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఇందులో దర్శకురాలు ఇచ్చిన సందేశం ప్రేమికుల వరకు మెప్పిస్తుంది అని చెప్పొచ్చు. క్షణికావేశంలో పోగొట్టుకున్న ఎన్నో రిలేషన్ షిప్స్ కి ఇది అద్దం పట్టేలా కనిపిస్తుంది. అలాంటి గొడవలు చిన్న చిన్న స్పర్థలు వల్ల విడిపోవడంపై తీసిన క్లైమాక్స్ మెసేజ్ బానే ఉంది.

ఇక లీడ్ రోల్స్ లో తేజ, కశ్వి బాగా చేశారు. సెటిల్డ్ నటన కనబరిచారు. గ్లామ్ షోలో కశ్వి బాగుంది. అలాగే తేజ మంచి లుక్స్ యంగ్ అండ్ మిడ్ ఏజ్ లో కనిపించాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, లవ్ సీన్స్ పర్వాలేదు. అలాగే రాఘవేంద్ర రావు స్టైల్ మేకింగ్ అండ్ మ్యూజిక్ తో కూడిన సన్నివేశాలు తన స్టైల్ ని ఇష్టపడేవారికి కనెక్ట్ అవుతాయి.

మైనస్ పాయింట్స్:

ఈ లఘు చిత్రంలో సందేశం ఓకే అనిపిస్తుంది. ట్రీట్మెంట్ అండ్ కాన్సెప్ట్ ఇది వరకు తెలియనిది అయితే ఏమీ కాదు అందరికీ తెలిసిందే కాబట్టి ఈ లఘు చిత్రం అంత కొత్తదనం కానీ మరీ అంత ఎమోషనల్ గా కూడా అనిపించదు. సో ఇందులో కథా కథనాలు రొటీన్ ఫీల్ నే కలిగిస్తాయి.

ఇక హీరోయిన్ కాస్ట్యూమ్స్ పరంగా కూడా ఇంకా కేర్ తీసుకోవాల్సింది. ఆమెని పరిచయం చేయడమే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా చూపిస్తారు కానీ ఆమె కాస్ట్యూమ్ చూస్తే యిట్టె ఎవరైనా చెప్తారు ఏదో సేల్స్ గర్ల్ లా ఉంది అని. అంతే కాకుండా ఆమెని ఒక ఇంట్రోవెర్ట్ గా పరిచయం చేశారు కానీ ఆమె రోల్ ని ఆ తరహాలో డిజైన్ చేయలేదు. తన పాత్రనికి ఇంకా బాగా షేప్ అవుట్ చేయాల్సింది. అలాగే లాస్ట్ లో చిన్న మెసేజ్ తప్ప మిగతా అంతా సింపుల్ గానే ఇందులో ఉంటుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సెటప్, టెక్నీకల్ పనితీరు కూడా బాగుంది. సంగీతం రాఘవేంద్ర రావు ఓల్డ్ సినిమాల సెటప్ లో బాగుంది. కెమెరా వర్క్ కూడా నీట్ గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. డబ్బింగ్ కొన్ని పాత్రలకి బాలేదు. ఇక దర్శకురాలు శరణ్య తేజు వర్క్ విషయానికి వస్తే.. తన సందేశం ఓకే కానీ ట్రీట్మెంట్ అంతా రొటీన్ గానే అనిపిస్తుంది. ఇంకా స్ట్రాంగ్ వర్క్ ని ఆమె ప్లాన్ చేసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ ‘మళ్ళీ వచ్చిన వసంతం’లో సందేశం ఓకే కానీ ఇది ఆల్రెడీ తెలిసిందే.. అంతే కాకుండా కథా కథనాలు కూడా రొటీన్ గానే అనిపిస్తాయి. మరీ రొటీన్ ప్రేమకథలు అయినా పర్వాలేదు చూస్తాం అనుకునేవారికి ఇది ఓకే అనిపిస్తుంది. కానీ మిగతా ఆడియెన్స్ కి అంత ఎగ్జైటింగ్ గా ఏమీ అనిపించదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

తాజా వార్తలు