ఓటిటిలోకి వచ్చాక ‘కపుల్ ఫ్రెండ్లి’ని ఆ లిస్ట్ లోకి తోసెయ్యడం గ్యారెంటీ!

ఓటిటిలోకి వచ్చాక ‘కపుల్ ఫ్రెండ్లి’ని ఆ లిస్ట్ లోకి తోసెయ్యడం గ్యారెంటీ!

Published on Mar 11, 2026 9:00 AM IST

Couple Friendly Public Talk

రీసెంట్ గా మన టాలీవుడ్ నుంచి వచ్చిన ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రమే ‘కపుల్ ఫ్రెండ్లి’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్స్ లో డీసెంట్ రన్ నే అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా చూసిన ఏ ఒక్కరి నుంచి కూడా చిన్న నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ని కూడా అందుకోలేదు.

కానీ ఈ సినిమా కంటెంట్ కి మాత్రం డెఫినెట్ గా అంతకు మించి సక్సెస్ రీచ్ కూడా సొంతం అయ్యి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఎలాగో ఓటిటి రిలీజ్ డేట్ ని ఈ చిత్రం ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ మార్చ్ 13కి ఫిక్స్ చేసి అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ్ లో విడుదల ఖరారు చేశారు. అయితే ఓటిటిలోకి వచ్చాక మాత్రం ఈ సినిమాని ఆడియెన్స్ ఓ లిస్ట్ లోకి తోసెయ్యడం గ్యారెంటీ..

అదే మనవాళ్ళకి ఒక అలవాటు ఉందిగా థియేటర్స్ లో ఉన్నపుడు మంచి సినిమాని చూడడం మానేసి ఓటిటిలోకో లేక తర్వాత ఎప్పుడో చూసి ‘టాలీవుడ్ ఫెయిల్డ్ హియర్’ అంటూ పోస్ట్ లు చేయడం.. ఇదే ఈ సినిమాకి కూడా జరిగే అవకాశం ఉంది. సో ఓటిటిలోకి వచ్చాక ఈ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి ఆదిత్య రవీంద్రన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ వర్క్ అందించగా యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు