‘గోల్డెన్ గ్లోబ్స్ 2026’ అవార్డు వేడుకలకు నిక్కీ గ్లేజర్‌తో పాటు ప్రియాంక చోప్రా కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తానికి అంతర్జాతీయ వేదికపై ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ వేడుక ప్రారంభానికి ముందు తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి ఆమె రెడ్ కార్పెట్‌పై ఫొటోలకు పోజులిచ్చింది. ఐతే, ఈ వేదికపై ఒక ఆసక్తికర ప్రశ్నకు ప్రియాంక చోప్రా సరదాగా బదులిస్తూ.. ఇంట్లో రిమోట్ ఎవరి చేతిలో ఉంటుందని అడగ్గా.. నిక్ చేతిలోనే ఉంటుందని తెలిపింది.
ప్రియాంక చోప్రా కంటే ముందు ఆమె భర్త నిక్ మాట్లాడుతూ.. ‘గతేడాది మాకు చాలా గొప్పగా గడిచింది. టీవీలో ఏం చూడాలి అనే విషయంలో మా ఇంట్లో ఒకరితో ఒకరం గొడవపడం. ఎవరికి నచ్చింది వాళ్లు చూస్తాం’’ అని నిక్ చెప్పాడు. దీనికి ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ‘నిక్‌కు నచ్చిన సినిమానే చూడమని చెబుతాను. నేను నా ఐప్యాడ్‌లో చూస్తాను’ అని ఆమె తెలిపింది. 2018లో పెళ్లి చేసుకున్న ప్రియాంక- నిక్ జొనాస్ లు 2022లో తల్లిదండ్రులయ్యారు. వారికి ఓ కుమార్తె ఉంది.


