ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు థ్రిల్లర్ సిరీస్ ‘దృశ్యం 3’ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూడో సీక్వెల్ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మోహన్ లాల్ పుట్టినరోజు కానుకగా మే 21న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సినిమాపై అంచనాలను పెంచుతూ టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 29, 2026న సాయంత్రం 5 గంటలకు ‘దృశ్యం 3’ టీజర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ అప్డేట్తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్లో జార్జ్ కుట్టి మరోసారి అదిరిపోయే మలుపులు చూపించబోతున్నాడని అర్థమవుతుంది. ఈ సారి జార్జ్ కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఎత్తుగడలు వేశాడో చూడాలని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.
ఈ చిత్రంలో మీనా, అన్సిబా హసన్, ఎస్తేర్ అనిల్, ఆశా శరత్ మరియు సిద్ధిఖీ తమ పాత పాత్రల్లోనే కనిపిస్తారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూరు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.



