మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). మంచి కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఇలా ఫైనల్ గా మెగా ఫ్యాన్స్ కి పూర్వ వైభవాన్ని అందించిన ఈ సినిమా నైజాం మార్కెట్ లో డే 1 మంచి ఓపెనింగ్స్ అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.
వీటి ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి 7.5 కోట్ల షేర్ (జి ఎస్ టి కలిపి) రాబట్టినట్టు తెలుస్తుంది. ఇది మాత్రం సినిమాకి సాలిడ్ స్టార్ట్ అని చెప్పాలి. డే 2 కూడా బుకింగ్స్ బాగానే కనిపిస్తున్నాయి. సో రెండో రోజు కూడా మంచి నంబర్స్ ఈ సినిమా సెట్ చేస్తుంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా వెంకీ మామ కీలక పాత్రలో నటించారు. అలాగే షైన్ స్క్రీన్స్ వారు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.


