‘శంకర వరప్రసాద్ గారు’లో ఆ సీన్‌పై మెగాస్టార్ కామెంట్స్..!

‘శంకర వరప్రసాద్ గారు’లో ఆ సీన్‌పై మెగాస్టార్ కామెంట్స్..!

Published on Jan 16, 2026 1:30 AM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu ) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ కామియో పాత్రలో కనిపించగా, నయనతార కథానాయికగా నటించారు.

సినిమా విడుదల అనంతరం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులపై అత్యంత బలమైన ప్రభావం చూపిన సన్నివేశం గురించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నయనతార, జరీనా వాహబ్‌ల మధ్య వచ్చే కీలక సీన్ ఆడియన్స్‌ను బాగా టచ్ చేసిందని ఆయన వెల్లడించారు.

“అనిల్ రావిపూడి అద్భుతంగా తీశాడు. భార్యాభర్తల మధ్య అపార్థం ఉన్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం చేసుకోకూడదన్న విషయం ఆ సీన్ చాలా బలంగా చెప్పింది. ఆ సన్నివేశం చూసిన ఒక దంపతులు తమ విడాకుల నిర్ణయాన్ని పునఃపరిశీలించి, మళ్లీ కలసి ఉండాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఇలా నిజజీవితాల్లో మార్పు తీసుకురావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది,” అని చిరంజీవి అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు