పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూరోప్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా సాగుతోంది. ఈ సినిమాని ఆగష్టు మొదటివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న సమయంలోగా ఈ సినిమా షూటింగ్ పూర్తీ అవుతుందని ఈ సినిమా టీం అంటున్నారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ సినిమా స్టైల్ లో ఈ సినిమాలో కూడా కామెడీ ఎక్కువగా ఉండవచ్చునని బావిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో సమంత, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ‘జల్సా’ తరువాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆగష్టులో విడుదలకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా
ఆగష్టులో విడుదలకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా
Published on Jun 24, 2013 1:10 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- లైట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టిన ‘టాక్సిక్’.. ఎందుకంటే!
- అఫీషియల్ : ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే…?
- డిజాస్టర్ ‘పంజా’ మేనియా మరోసారి షురూ.. 4 షోస్ తోనే ట్రెండింగ్ బుకింగ్స్!
- మార్ప్ చేశారు, పైగా ట్రోల్ కూడా చేశారు – కంగనా
- రేపటి నుంచి స్టార్ట్ కానున్న ‘జార్జ్ క్రిష్’ !
- ‘డ్రాగన్’ షూట్ పై లేటెస్ట్ అప్ డేట్ !
- 100 కోట్ల ఓపెనింగ్ తో ‘టాక్సిక్’ ర్యాంపేజ్.. డే 1 ప్రిడిక్షన్!
- ‘ఇరుముడి’ పై ‘పెద్ది’ రామ్ చరణ్ రెస్పాన్స్ వైరల్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : ‘టాక్సిక్’ – స్టైల్ ఉన్నా.. సోల్ లేని పీరియాడిక్ డ్రామా!
- టాక్సిక్ : స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతి.. అక్కడ టికెట్ రేటు ఎంతంటే..?
- ‘ఇరుముడి’ బాక్సాఫీస్ రికార్డులు: 4 రోజుల్లోనే 38 లక్షల టికెట్లు.. రూ.100 కోట్ల క్లబ్, ‘బాహుబలి 2’ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఆక్యుపెన్సీ
- ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. చెప్పుకోలేనిది చెప్పారు!
- స్వామి శరణం: నైజాంలో “ఇరుముడి” సెన్సేషన్.. వర్కింగ్ డేలో కూడా ట్రేడ్ షాకయ్యే వసూళ్లు!
- రేపే ‘టాక్సిక్’ విడుదల: ఏపీ, తెలంగాణల్లో మొదలైన బుకింగ్స్.. తొలి షో ఎప్పుడంటే?
- కొన్ని గంటలే ఉన్నా తెరుచుకోని ‘టాక్సిక్’ తెలుగు బుకింగ్స్!
- ‘ఇరుముడి’కి టాక్సిక్ డేంజర్ బెల్స్.. సగానికి పైగా లాగేస్తుందా..?


