యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా అప్ డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, ఎన్టీఆర్ ఊహించని విధంగా గాయానికి లోనైన సంగతి తెలిసిందే. విజయవంతంగా ఎన్టీఆర్ కి సర్జరీ కూడా జరిగింది. ప్రస్తుతం తారక్ రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ను ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తారట.
అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది. కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ ఫ్లాష్ బ్యాక్ కోసం అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


