‘ఇరుముడి’ పై ‘పెద్ది’ రామ్ చరణ్ రెస్పాన్స్ వైరల్!

‘ఇరుముడి’ పై ‘పెద్ది’ రామ్ చరణ్ రెస్పాన్స్ వైరల్!

Published on Aug 26, 2026 3:03 PM IST

గత వారం థియేటర్స్ లోకి వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన తెలుగు సినిమానే “ఇరుముడి”. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఊహించని వసూళ్లతో రవితేజకి భారీ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. ఇక ఆ తర్వాత సినిమా ప్రముఖులు నుంచి కూడా ఈ సినిమాకి ప్రశంసలు కూడా చాలానే వచ్చాయి.

నిన్ననే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమా విషయంలో ఎంతో ఎమోషనల్ అయ్యింది. నేడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇరుముడి విషయంలో ఇచ్చిన రెస్పాన్స్ వైరల్ గా మారింది. రవితేజ మరియు ఇరుముడి యూనిట్ మొత్తం అందరికీ, సాధించిన భారీ సక్సెస్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని, సినిమాకు లభిస్తున్న ప్రేమ, స్పందనను చూసి చాలా ఆనందంగా ఉంది.

రవి తేజ గారు మరియు చిత్ర బృందం మొత్తం వారి కష్టానికి అన్ని ప్రశంసలకు అర్హులు అని రామ్ చరణ్ తెలిపి తన ఇష్టదైవం అయ్యప్ప స్వామికి స్వామి శరణం అంటూ ముగించడం హైలైట్ గా మారింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఉన్నట్టు ఆ మధ్య రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు