స్టడీగా దూసుకెళ్తున్న ‘అనగనగా ఒక రాజు’.. మైల్‌స్టోన్ మార్క్‌కు చేరువలో నవీన్ పొలిశెట్టి

స్టడీగా దూసుకెళ్తున్న ‘అనగనగా ఒక రాజు’.. మైల్‌స్టోన్ మార్క్‌కు చేరువలో నవీన్ పొలిశెట్టి

Published on Jan 17, 2026 12:39 AM IST

Anaganaga Oka Raju

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘అనగనగా ఒక రాజు’ సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి టాక్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను మారి డైరెక్ట్ చేయగా పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ చిత్రం ఓవర్సీస్‌లో సాలిడ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో 735K డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మంచి విజయబాటలో దూసుకుపోతోంది. ఈ కలెక్షన్స్ మరింత పెరిగి త్వరలోనే మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

నవీన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా రావు రమేష్ కీలక పాత్రలో నటించారు. మిక్క్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు