మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించి అలరించారు. ఇది బాగా వర్కౌట్ కూడా అయింది. అందుకే, ఇదే ఆలోచనను తన సినిమాకి కూడా అప్లై చేయబోతున్నారట దర్శకుడు బాబీ. చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్రలో ఓ యంగ్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ యంగ్ హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఆ పాత్రలో ఏ హీరో నటించబోతున్నాడో చూడాలి.
ఇక ఈ సినిమా జనవరి 25, 2026న అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.


