‘మెగా సినిమా’లో బాబీ కూడా అదే ప్లాన్ ?

‘మెగా సినిమా’లో బాబీ కూడా అదే ప్లాన్ ?

Published on Jan 19, 2026 8:00 AM IST

Bobby-Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించి అలరించారు. ఇది బాగా వర్కౌట్ కూడా అయింది. అందుకే, ఇదే ఆలోచనను తన సినిమాకి కూడా అప్లై చేయబోతున్నారట దర్శకుడు బాబీ. చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. కాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్రలో ఓ యంగ్ హీరో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో ఆ యంగ్ హీరో కనిపిస్తాడని తెలుస్తోంది. మరి ఆ పాత్రలో ఏ హీరో నటించబోతున్నాడో చూడాలి.

ఇక ఈ సినిమా జనవరి 25, 2026న అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అన్నట్టు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించనున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు