మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) సంక్రాంతి బరిలో రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది.
ఇక ఈ సినిమాలో చిరు తనదైన కామెడీ టైమింగ్‌తో వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తుకు చేశారు. దీంతో అభిమానులు, ప్రేక్షకులు చిరు చేసే కామెడీని చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త ట్రెండ్ కంటిన్యూ చూస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఇప్పటికే ఏకంగా 3 మిలియన్‌కు పైగా టికెట్ అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.
దీంతో ఓ రీజనల్ సినిమా ఇంత త్వరగా 3 మిలియన్ మార్క్‌ను అందుకోవడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్‌లో చేశారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాను సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేశారు.



