మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంతో దూసుకుపోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతూ నిజమైన జాక్‌పాట్‌గా మారింది. హీరోయిన్‌గా నయనతార నటించగా, విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో రోల్‌లో మెప్పించారు.
ఇక ఈ సినిమా నైజాం మార్కెట్‌లో చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచే దిశగా సాగుతోంది. ఆదివారం ఒక్కరోజే రూ. 3.40 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం, మొత్తం నైజాంలో రూ.32.5 కోట్ల షేర్‌తో దుమ్ములేపుతోంది. ఒకప్పుడు మెగాస్టార్‌కు కంచుకోటగా ఉన్న నైజాం ప్రాంతం, గత కొన్నేళ్లుగా ఊగిసలాటను చూసింది. అయినప్పటికీ ఈ సినిమాతో చిరు తన పాత ఆధిపత్యాన్ని మళ్లీ స్థాపించారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వినోదం, కుటుంబ భావోద్వేగాలు, చిరు ఎనర్జీ అన్నీ కలగలిసి సినిమాకు పెద్ద ప్లస్‌గా మారాయి.
సాహు గరపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రంలో క్యాథరిన్ థ్రెసా, అభినవ్ గోమటమ్, జరీనా వహాబ్, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.


