సర్‌ప్రైజ్ : ‘మన శంకర వరప్రసాద్ గారు’లో సింగర్‌గా చిరు మేనకోడలు.. ఫుల్ సాంగ్ వచ్చేస్తోంది..!

సర్‌ప్రైజ్ : ‘మన శంకర వరప్రసాద్ గారు’లో సింగర్‌గా చిరు మేనకోడలు.. ఫుల్ సాంగ్ వచ్చేస్తోంది..!

Published on Jan 20, 2026 7:10 PM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ దూకుడు చూపిస్తోంది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో చిరు తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో ఇరగదీశారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. అయితే, ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజింగ్ విషయాన్ని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.

ఈ సినిమాలో వచ్చే ‘ఫ్లయింగ్ హై’ అనే పాటను మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు నైరా పాడినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. చిరు సోదరి మాధవి కూతురే ఈ నైరా. ఈ పాటతో ఆమె సింగర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా నుంచి ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను రేపు(జనవరి 21) ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

ఇక ఈ పాట సినిమాలో ఎమోషనల్ ఫీలింగ్‌ను తీసుకొచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మరి ఈ వీడియో సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు