మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ దూకుడు చూపిస్తోంది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో చిరు తనదైన వింటేజ్ కామెడీ టైమింగ్‌తో ఇరగదీశారు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. అయితే, ఈ సినిమా నుంచి ఓ సర్‌ప్రైజింగ్ విషయాన్ని మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.
ఈ సినిమాలో వచ్చే ‘ఫ్లయింగ్ హై’ అనే పాటను మెగాస్టార్ చిరంజీవి మేనకోడలు నైరా పాడినట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. చిరు సోదరి మాధవి కూతురే ఈ నైరా. ఈ పాటతో ఆమె సింగర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా నుంచి ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను రేపు(జనవరి 21) ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.
ఇక ఈ పాట సినిమాలో ఎమోషనల్ ఫీలింగ్‌ను తీసుకొచ్చిందని చిత్ర యూనిట్ చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. మరి ఈ వీడియో సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.
A melody that celebrates the most selfless love of all ❤️#FlyingHigh Full Video Song from #ManaShankaraVaraPrasadGaru out tomorrow at 11:07 AM ❤️🔥
Sung by #Naira
Lyrics by #KittuVissapragada
Music by #BheemsCeciroleo #MegaSankranthiBlockbusterMSG in cinemas now 🫶🏻 pic.twitter.com/70Gvhi4qSX— Shine Screens (@Shine_Screens) January 20, 2026


