పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మాస్ లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ ఏడాదిలోనే గ్రాండ్ గా మేకర్స్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆ మధ్య నిర్మాత నుంచి ఏప్రిల్ రిలీజ్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.
మరి దీనిపై లేటెస్ట్ స్ట్రాంగ్ బజ్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీని ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏప్రిల్ 23 లేదా 24న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు వినిపిస్తుంది. ఈ డేట్స్ లో ఏదోకటి అయితే ఖరారు అని వైరల్ అవుతుంది. మరి వీటిలో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. అలాగే తమిళ నటుడు పార్తిబన్ ఈ సినిమాలో విలన్ గా నటించారు.


