టాలీవుడ్ యువహీరో ఆది సాయికుమార్ గత కొంత కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. ఫైనల్ గా ఆ హిట్ తనకు శంబాల (Shambala) రూపంలో వచ్చింది. గత డిసెంబర్ లో విడుదల అయ్యిన ఈ సినిమా ఇంట్రెస్టింగ్ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ గా ఆడియెన్స్ ని మెప్పించింది. దర్శకుడు యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీలో అందుబాటులో వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు మన తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకోగా అందులో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. కానీ ఈ సినిమా ప్రస్తుతం ఆహా గోల్డ్ యూజర్లు మాత్రమే ఇవాళ చూడొచ్చు. రేపటి నుంచి రెగ్యులర్ సబ్ స్క్రైబర్ లు చూడొచ్చు. సో ఒకవేళ మీరు గోల్డ్ యూజర్ అయితే ఈ థ్రిల్లర్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


