ఎన్టీఆర్ కోసం ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

ఎన్టీఆర్ కోసం ఆర్ఆర్ఆర్ బ్యూటీ.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

Published on Jan 22, 2026 3:59 PM IST

NTR

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా డిజైన్ చేస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్. అంతేగాక, ఇందులోని క్యాస్టింగ్ విషయంలోనూ ఆయన చాలా పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, రుక్మిణి వసంత్ వంటి యాక్టర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్ట్రాటెజీ ఫాలో అవుతున్నాడట. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఒలివియా మారిస్‌ను నటింపజేయాలని నీల్ ప్లాన్ చేస్తున్నాడట. ఆర్ఆర్ఆర్ చిత్రంలో భీమ్ పాత్రను లవ్ చేసే పాత్రలో ఒలీవియా మారిస్ నటించింది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌తో ఆమె సీన్స్ బాగా పండాయి.

దీంతో ఇప్పుడు ఈ బ్యూటీని డ్రాగన్ చిత్రంలోనూ నటింపజేయాలని.. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నాడట. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు