‘విశ్వంభర’ ఓటిటి డీల్ కొలిక్కి? మళ్ళీ ఆ సంస్థకే మెగాస్టార్ ఫాంటసీ బొమ్మ?

‘విశ్వంభర’ ఓటిటి డీల్ కొలిక్కి? మళ్ళీ ఆ సంస్థకే మెగాస్టార్ ఫాంటసీ బొమ్మ?

Published on Mar 11, 2026 12:58 PM IST

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి నుంచి ఈ ఏడాది ఆల్రెడీ వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యిన చిత్రమే మన శంకర వరప్రసాద్ గారు. సింపుల్ ఫ్యామిలీ సినిమాతో వచ్చి మెగాస్టార్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టి చూపించారు. ఇక ఈ సినిమా తర్వాత అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమానే “విశ్వంభర”.

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ విజువల్ ట్రీట్ అలా ఆలస్యం అవుతూ వచ్చింది. అలాగే రిలీజ్ ఎప్పుడు అనేది కూడా ఒకింత సస్పెన్స్ గా మారగా దీనికి కారణాల్లో ఓటిటి డీల్ కూడా ఇంకా పూర్తి కాకపోవడం అన్నట్టు వినిపించింది. అయితే ఫైనల్ గా ఓటిటి డీల్ కి సంబంధించి మేటర్ ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ సినిమా కోసం ఫ్రంట్ రన్నర్ గా జీ 5 మరియు ప్రైమ్ వీడియోలు ఉన్నట్టు టాక్. దాదాపు మన శంకర వరప్రసాద్ గారు ని సొంతం చేసుకున్న జీ 5 వాళ్ళే ఈ సినిమాని కూడా తీసుకునే అవకాశం ఉందని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు