ట్విస్ట్: ‘ఉస్తాద్’లో ఈ సాంగ్ తీసేసారా?

ట్విస్ట్: ‘ఉస్తాద్’లో ఈ సాంగ్ తీసేసారా?

Published on Mar 11, 2026 2:00 PM IST

Aura Of Ustaad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి ఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. అభిమానులు ఎన్నో ఏళ్ళు నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఉగాది కానుకగా విడుదలకి రాబోతుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ కి వస్తున్న నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ కాకుండా మిగతా రెండు సాంగ్స్ కంటెంట్ బయటకి వచ్చింది. వీటిలో ఎంతో హైప్ ఇస్తూ చేసిన ఆరా ఆఫ్ ఉస్తాద్ కూడా ఒకటి.

అయితే ఈ సాంగ్ ఎంతమందికి నచ్చిందో అంతే రీతిలో చాలామందికి సరిగ్గా ఎక్కలేదు. కానీ దీనిపై లేటెస్ట్ ప్రోగ్రెస్ ఏంటనే ఈ సాంగ్ అసలు థియేటర్స్ లో ఉండబోదట. ఇది మాత్రం ఫ్యాన్స్ కి ట్విస్ట్ అనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి పాటలు దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా థమన్ ఎస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా మార్చ్ 19న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు