కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ నుంచి గత ఏడాది పాన్ ఇండియా ముఖ్య భాషలు మూడింటి నుంచీ పలు సినిమాలు వచ్చాయి. తెలుగు, తమిళ్, హిందీ లలో ఈ సినిమాలు రాగా హిందీ, తెలుగు నుంచి వచ్చిన తేరే ఇష్క్ మే, కుబేర చిత్రాలు హిట్ అయ్యాయి.అయితే హిందీ చిత్రం తేరే ఇష్క్ మే తెలుగులో అమర కావ్యం గా సైలెంట్ గా.విడుదల అయ్యింది. కానీ ఆడలేదు. హిందీలో మాత్రమే హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫైనల్ గా ఓటీటీ అందుబాటులోకి వచ్చేసింది.
మొత్తం తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో నెట్ ఫ్లిక్స్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి తెచ్చిన ఈ సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా చూడొచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి సనన్ నటించగా ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. అలాగే ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


