నిఖిల్ ‘స్వయంభు’ కొత్త డేట్ లాక్!?

నిఖిల్ ‘స్వయంభు’ కొత్త డేట్ లాక్!?

Published on Jan 24, 2026 1:00 PM IST

Swayambhu

మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నుంచి రాబోతున్న అవైటెడ్ భారీ చిత్రమే ‘స్వయంభు’. భారీ బడ్జెట్ తో దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కించిన ఈ సినిమాలో నభా నటేష్ అలాగే సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే మేకర్స్ ఆల్రెడీ ఫిబ్రవరి రిలీజ్ కి దీనిని విడుదల చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. కానీ ఈ మధ్య లోనే ఈ సినిమా వాయిదా పడొచ్చని మేము తెలిపాము. ఇందులో భాగంగా ఇప్పుడో కొత్త డేట్ వినిపిస్తుంది. దీని ప్రకారం చిత్ర యూనిట్ ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని ఈ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందించగా భువన్, శ్రీకర్ లు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు