మాసివ్ బుకింగ్స్ తో బ్యాటింగ్ షురూ చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’..!

మాసివ్ బుకింగ్స్ తో బ్యాటింగ్ షురూ చేసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’..!

Published on Jan 25, 2026 9:00 AM IST

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో చేసిన అవైటెడ్ ఎంటర్టైనర్ చిత్రమే ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu). మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి దుమ్ము లేపింది. ఇలా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా రెండో వీకెండ్ లో బ్యాటింగ్ షురూ చేసింది. భారీ బుకింగ్స్ గత 24 గంటల్లో ఈ సినిమాకి నమోదు కావడం విశేషం.

గత 24 గంటల్లో ఈ సినిమాకి లక్షకి పైగా టికెట్ బుక్ మై షోలో బుక్ అయ్యాయి. దీనితో ఈ సినిమా ఈ లాంగ్ వీకెండ్ లో సాలిడ్ నంబర్స్ నమోదు చేయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. శనివారం, ఆదివారం అలాగే ఇప్పుడు సోమవారం (గణతంత్ర దినోత్సవ) హాలిడే కూడా సాలిడ్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. సో మన శంకర వర ప్రసాద్ గారు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా వెంకీ మామ తన క్యామియోతో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. అలాగే సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మాణం వహించారు.

Untitled 10 1

తాజా వార్తలు