డైరెక్ట్ ఓటిటిలోకే ‘అన్నగారు వస్తారు’.. రెండు వారాలకే రిలీజ్

డైరెక్ట్ ఓటిటిలోకే ‘అన్నగారు వస్తారు’.. రెండు వారాలకే రిలీజ్

Published on Jan 27, 2026 12:02 PM IST

Annagaru-Vostaru

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే ‘వా వాథియర్’ (Vaa Vaathiyaar). ఈ చిత్రాన్ని తెలుగులో ‘అన్నగారు వస్తారు'(Annagaru Vostaru) గా ఈ గత నెలలో ప్లాన్ చేశారు కానీ ఈ సినిమాకి కూడా పలు ఇబ్బందులు మూలాన తెలుగులో రిలీజ్ ఆగిపోయింది. కానీ ఫైనల్ గా పొంగల్ కానుకగా మొదట తమిళ్ వెర్షన్ లో ఈ చిత్రం రిలీజ్ కి వచ్చింది.

అయితే తెలుగులో కూడా ఈ సినిమా వస్తుందని భావించారు కానీ ఈ సినిమా ట్విస్ట్ ఇస్తూ తెలుగులో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కి వచ్చేస్తుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. దర్శకుడు నలన్ కుమారస్వామి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్ తమిళ్, తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కావాల్సింది ఆగింది. అయితే తమిళ్ లో అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ అందుకోని క్రమంలో ఈ సినిమా ఇప్పుడు కేవలం రెండు వారాల్లోనే ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యిపోయింది.

ఈ సినిమా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా అందులో ఈ జనవరి 28 నుంచే సినిమా రానున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. సో కేవలం 2 వారాల్లోనే ఈ సినిమా వచ్చేస్తుండగా తెలుగులో అయితే డైరెక్ట్ విడుదల అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు